Tovino Thomas: మైత్రీ బ్యానర్లో మలయాళ స్టార్ హీరో సినిమా!

Tovino Thomas in Mythri Movie

  • భారీ బడ్జెట్ చిత్రాల బ్యానర్ గా మైత్రీ 
  • ఇతర భాషా సినిమాల నిర్మాణంపై దృష్టి 
  • టోవినో థామస్ హీరోగా మలయాళంలో 'నడికర్ తిలకం'
  • దర్శకుడిగా లాల్ జూనియర్


తెలుగులో ఒక వైపున భారీ బడ్జెట్ సినిమాలు .. మరో వైపున చిన్న తరహా సినిమాలు చేస్తూనే, వెబ్ సిరీస్ ల దిశగా కూడా దృష్టి పెట్టిన బ్యానర్ గా మైత్రీ మూవీస్ కనిపిస్తుంది. ఈ బ్యానర్ ఇంతవరకూ నిర్మిస్తూ వచ్చిన సినిమాలలో సక్సెస్ శాతమే ఎక్కువ. కంటెంట్ కి తగిన ఖర్చు చేయడానికి ఎంతమాత్రం వెనుకాడని బ్యానర్ గా పేరు ఉంది. 

అలాంటి ఈ బ్యానర్ ఇప్పుడు ఇతర భాషా చిత్రాల నిర్మాణం దిశగా కూడా అడుగులు వేయడం మొదలెట్టింది. ఆల్రెడీ బాలీవుడ్ లో ఒక ప్రాజెక్టును లైన్లో పెట్టేసింది. అలాగే మల్లూవుడ్ లోను ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించింది. ఈ సినిమాలో కథానాయకుడు టోవినో థామస్. నిన్ననే ఈ సినిమాను 'కొచ్చి'లో లాంచ్ చేశారు.మలయాళంలో టోవినో థామస్ కి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. 'మిన్నల్ మురళి' .. '2018' సినిమాలతో ఆయన క్రేజ్ .. మార్కెట్ మరింతగా పెరిగిపోయాయి. అలాంటి టోవినో థామస్ హీరోగా మలయాళంలో మైత్రీవారి తొలి సినిమా మొదలైంది. 'నడికర్ తిలకం' టైటిల్ ను ఖరారు చేసుకున్న ఈ సినిమాకి, లాల్ జూనియర్ దర్శకత్వం వహిస్తున్నాడు. 

Tovino Thomas
Actor
Nadikar Thilakam
  • Loading...

More Telugu News