Vidadala Rajini: ఏపీ వైద్యారోగ్యశాఖమంత్రి విడదల రజనికి అస్వస్థత

AP Minister Vidadala Rajini Fell Ill

  • జగ్గయ్యపేటలో రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలు ప్రారంభించిన మంత్రి
  • అనంతరం జరిగిన కార్యక్రమంలో రజనికి అస్వస్థత
  •  ఓఆర్ఎస్ అందించిన అధికారులు

ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని నిన్న స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక వైద్యశాలలో నూతన భవనాలు, పలు విభాగాలను ఆమె ప్రారంభించారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో మంత్రి కొంత అసౌకర్యంగా కనిపించారు. సభలో కాసేపు మాట్లాడి కూర్చుండిపోయారు. 

మంత్రి పరిస్థితిని గమనించిన అధికారులు, వైద్యులు వెంటనే ఆమెకు ఓఆర్ఎస్ అందించారు. ఆ తర్వాత కార్యక్రమం జరుగుతుండగానే ఆమె వెనుదిరిగి వెళ్లిపోయారు. అలసట నీరసం కారణంగానే ఆమె అస్వస్థతకు గురైనట్టు వైద్యులు తెలిపారు. 

Vidadala Rajini
Andhra Pradesh
Jaggayyapeta

More Telugu News