Harsha: 'సుందరం మాస్టర్' టీజర్ రిలీజ్!

Sundaram Master Teaser Released

  • 'సుందరం మాస్టర్' గా హర్ష 
  • ఆయన జోడీగా దివ్య శ్రీపాద 
  • వినోదమే ప్రధానంగా సాగే సినిమా 
  • నిర్మాతగా హీరో రవితేజ 
  • దర్శకుడిగా కల్యాణ్ సంతోష్ పరిచయం

ఈ మధ్య కాలంలో ఆడియన్స్ నుంచి కంటెంట్ బాగుంటే చాలు అనే అభిప్రాయమే వినపడుతోంది. కంటెంట్ కొత్తగా .. పూర్తి వినోదభరితంగా ఉంటే చాలు, భారీ వసూళ్లను ముట్టజెబుతున్నారు. దాంతో కొత్త దర్శకులు వీలైనంత వరకూ డిఫరెంట్ కంటెంట్ పట్టుకునే సెట్స్ పైకి వచ్చేస్తున్నారు. అలా వచ్చిన సినిమాగా 'సుందరం మాస్టర్' కనిపిస్తోంది. 

హర్ష - దివ్య శ్రీపాద ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి హీరో రవితేజ - సుధీర్ కుమార్ నిర్మాతలుగా ఉన్నారు. ఈ సినిమాతో దర్శకుడిగా కల్యాణ్ సంతోష్ పరిచయమవుతున్నాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి, సాయితేజ్ చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయించారు. 

అడవికి సమీపంలోని ఒక గిరిజన గూడెంలో ఈ కథ నడవనున్నట్టు టీజర్ ను బట్టి తెలుస్తోంది. అక్కడి ప్రజలకు ఇంగ్లిష్ నేర్పించడానికి హర్ష ట్రై చేస్తే, వాళ్లు తన కంటే ఫాస్టుగా ఇంగ్లిష్ మాట్లాడటంతో ఆయన బిత్తరపోతాడు. కామెడీనే ప్రధానంగా ఈ కథ ముందుకు నడుస్తుందని అర్థమవుతోంది. 

Harsha
Divya Sripada
Sundaram Master

More Telugu News