alla ramakrishna reddy: పవన్ కల్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో.. వాలంటీర్ కాళ్లు కడిగిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల

Mangalagiri MLA washes volunteer legs

  • దుగ్గిరాల మండలం ఈమని గ్రాంలో ఆళ్ల పర్యటన
  • వాలంటీర్లను పవన్ అవమానించవద్దని సూచన
  • వాలంటీర్ రజిత కాళ్లు కడిగి, శాలువా కప్పిన రామకృష్ణారెడ్డి

వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వినూత్న నిరసన తెలిపారు. తన నియోజకవర్గంలోని ఓ వాలంటీర్ కాళ్లు కడిగారు. నియోజకవర్గ పరిధిలోని దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో ఆళ్ల మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పవన్ వాలంటీర్ వ్యవస్థను అవమానించేలా మాట్లాడటాన్ని తప్పుబట్టారు. నిత్యం ప్రజల కోసం పని చేసే వాలంటీర్లను ప్రశంసించకపోయినా పర్వాలేదని, కానీ అవమానించడం సరికాదన్నారు.

వాలంటీర్లపై ప్రతిపక్షాలు చేసే అనుచిత వ్యాఖ్యలు వారిని బాధిస్తున్నాయన్నారు. వాలంటీర్లకు వైసీపీ అండగా ఉంటుందని చెప్పేందుకే తాను మహిళా వాలంటీర్ ను సన్మానిస్తున్నట్లు చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల వైసీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందన్నారు. అనంతరం నియోజకవర్గంలోని దళిత మహిళా వాలంటీర్ రజిత కాళ్లను కడిగారు. ఆమెకు శాలువా కప్పి, పూలదండతో సత్కరించారు.

alla ramakrishna reddy
Mangalagiri
Pawan Kalyan
Janasena
  • Loading...

More Telugu News