Tamilisai Soundararajan: గవర్నర్‌ తమిళసైకీ తప్పని ట్రాఫిక్ ఇక్కట్లు

Governor struck in traffic near somajiguda u turn

  • సోమాజిగూడ యూటర్న్ వద్ద నిలిచిపోయిన గవర్నర్ కాన్వాయ్ 
  • వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దిన గవర్నర్ సిబ్బంది
  • కాసేపు వాహనాలను నిలిపివేయడంతో ముందుకు కదిలిన కాన్వాయ్
  • ట్రాఫిక్ పోలీసుల సమన్వయ లోపంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్టు సమాచారం

తెలంగాణ గవర్నర్ తమిళసైకీ ట్రాఫిక్ సమస్యలు తప్పలేదు. సోమవారం సాయంత్రం గవర్నర్ ఖైరతాబాద్‌లోని హనుమాన్ ఆలయానికి వచ్చిన సందర్భంగా ఆమె కాన్వాయ్ కాసేపు ట్రాఫిక్‌లో చిక్కుకుపోవాల్సి వచ్చింది. సోమాజిగూడ వద్ద యూటర్న్ తీసుకునే సమయంలో కాన్వాయ్ నిలిచిపోయింది. 

ఎర్రమంజిల్ నుంచి ఖైరతాబాద్ వెళ్లే మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో వెంటనే కాన్వాయ్‌కు యూటర్న్ తీసుకోవడం కుదరలేదు. ఈలోపు గవర్నర్ సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. యూటర్న్ వద్ద వాహనాలను కొద్దిసేపు నిలిపివేయడంతో కాన్వాయ్ ముందుకు కదిలింది. ట్రాఫిక్ పోలీసుల సమన్వయ లోపం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది.

Tamilisai Soundararajan
Telangana
KCR
BJP
  • Loading...

More Telugu News