Bigg Boss: త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్-7... ప్రోమో విడుదల!

Bigg Boss season 7 Telugu reality show promo out now

  • తెలుగు టెలివిజన్ తెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్
  • ఇప్పటివరకు 6 సీజన్లు పూర్తి
  • ఫుల్ ప్యాకేజి ఎంటర్టయిన్ మెంట్ తో వస్తున్నామన్న స్టార్ మా

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పూర్తి భావోద్వేగాలతో కూడిన వినోదం పంచడంలో బిగ్ బాస్ రియాలిటీ షో ముందుంటుంది. ఇప్పటివరకు 6 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో త్వరలోనే 7వ సీజన్ తో పలకరించనుంది. ఈ కార్యక్రమ ప్రసారకర్త స్టార్ మా చానల్ తాజాగా బీబీ7 ప్రోమో విడుదల చేసింది. రెడీగా ఉండండి... ఎమోషన్ల ఎత్తుపల్లాల్లో మిమ్మల్ని ఉర్రూతలూగించడానికి బిగ్ బాస్ తెలుగు సీజన్-7 వచ్చేస్తోంది అని స్టార్ మా చానల్ పేర్కొంది. మరిన్ని సర్ ప్రైజ్ లు, మరిన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్... సిల్లీ ఫైట్స్ నుంచి హృదయాలు బరువెక్కించే గాథల వరకు... సంపూర్ణ వినోదం గ్యారెంటీ అని మేం మీకు హామీ ఇస్తున్నాం అని వివరించింది.

Bigg Boss
Season-7
Telugu Reality Show
Star Maa
Telangana
Andhra Pradesh
  • Loading...

More Telugu News