Asaduddin Owaisi: కేసీఆర్ హామీ ఇచ్చారు.. జగన్ సమయం ఇస్తే కలుస్తాం: అసదుద్దీన్

Asaduddin says KCR will oppose UCC

  • ఉమ్మడి పౌర స్మృతిని వ్యతిరేకిస్తామని తెలంగాణ సీఎం చెప్పారన్న అసద్
  • లౌకికవాదాన్ని దెబ్బతీయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని విమర్శ
  • దేశాన్ని ప్రధాని మోదీ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ

ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని వ్యతిరేకిస్తామని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. కేసీఆర్ తో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడుతూ... యూసీసీపై సీఎంతో చర్చించినట్లు చెప్పారు. గత పదేళ్లుగా తెలంగాణ ప్రశాంతంగా ఉందని, యూసీసీ ప్రజాస్వామ్యానికి మంచిదికాదని కేసీఆర్ కు విన్నవించామన్నారు. దీంతో లౌకికవాదాన్ని దెబ్బతీయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు.

ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అసదుద్దీన్ విమర్శలు గుప్పించారు. యూసీసీని వ్యతిరేకిస్తామని తెలంగాణ సీఎం చెప్పారని, ఏపీ సీఎం జగన్ కూడా దీనిని వ్యతిరేకించాలని తాము కోరుతున్నామన్నారు. సమయం ఇస్తే జగన్ ను కూడా కలుస్తామన్నారు. ముస్లీం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులతో కలిసి అసద్ సోమవారం ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిశారు.

Asaduddin Owaisi
MIM
KCR
ucc
Narendra Modi
  • Loading...

More Telugu News