Tollywood: హింట్ కాంబో రిపీట్.. గోపీచంద్‌ మలినేనితో రవితేజ నాలుగో సినిమా

 Ravi Teja and Gopichand Malineni reunite again for RT4GM

  • డాన్ శీను, బలుపు, క్రాక్ తో హ్యాట్రిక్ సాధించిన గోపీ, రవి
  • మైత్రీ మూవీస్ నిర్మాణంలో మరో సినిమా ప్రకటన
  • సంగీత దర్శకుడిగా తమన్

టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్లు రిపీట్ అవుతుంటాయి. ఈ విషయంలో స్టార్ హీరోలు ముందుంటారు. తమకు విజయాలను ఇచ్చిన దర్శకులను రిపీట్ చేస్తుంటారు. ఈ బాటలోనే మాస్ మహారాజా రవితేజ కూడా నడుస్తున్నారు. తనకు డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి భారీ విజయాలతో ‘హ్యాట్రిక్’ అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో నాలుగో సినిమా చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 

సినిమా ప్రకటనకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ చూస్తుంటే రవితేజ కోసం గోపీచంద్ మరో పవర్‌ ‌ఫుల్ కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. పోస్టర్లో ఓ గ్రామం, కాలిపోతున్న ఇల్లు, దేవాలయం, డేంజర్ బోర్డు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నారు. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.

Tollywood
Raviteja
Gopichand Malineni
RT4GM
  • Loading...

More Telugu News