Heart Attack: ఖమ్మంలో 24 గంటల వ్యవధిలో గుండెపోటుతో ఇద్దరి మృతి

Man died with heart attack after coming from gym in Khamma
  • జిమ్ నుంచి ఇంటికొచ్చిన కాసేపటికే గుండెపోటు
  • ఆసుపత్రికి తీసుకెళ్లిన కాసేపటికే మృతి
  • నిన్న ఉదయం అల్లిపురంలో గుండెపోటుకు ఓ వ్యక్తి బలి
ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు బాగా పెరిగాయి. ఆరోగ్యంగా కనపడుతున్న వారు కూడా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా టీనేజర్లు, యువత గుండెపోటు బారినపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 

తాజాగా ఖమ్మంలో 24 గంటల వ్యవధిలో ఇద్దరు వ్యక్తులు గుండెపోటుతో మృతి చెందారు. 31 ఏళ్ల శ్రీధర్ ఈ ఉదయం జిమ్‌లో వ్యాయామం చేసి ఇంటికొచ్చిన కాసేపటికే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కాసేపటికే మరణించాడు. 

శ్రీధర్ తండ్రి మానుకొండ రాధాకిశోర్ గతంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. కాగా, ఖమ్మంలోని అల్లిపురంలో నిన్న ఉదయం గరికపాటి నాగరాజు (33) కూడా గుండెపోటుతోనే ప్రాణాలు విడిచాడు.
Heart Attack
Khamma
Telangana

More Telugu News