Tana: ఏ దేశానికి వెళ్లినా తెలుగువాళ్లు సత్తా చాటుతున్నారు: బాలకృష్ణ

Actor Balakrishna comments in TANA Mahasabhalu 2023

  • అమెరికాలో జరిగిన తానా సభల్లో ప్రసంగించిన హీరో
  • ఎన్టీఆర్ కు నివాళులు అర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం
  • నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపిన బాలకృష్ణ

తెలుగు వారు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా సరే అక్కడ తమ సత్తా చాటుతున్నారని హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఈమేరకు అమెరికాలో జరుగుతున్న తానా మహాసభలలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సభలలో మహానటుడు ఎన్టీఆర్ కు నివాళి అర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. ఇందుకు సభా నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. తానా క్యాన్సర్‌ క్యాంపులు నిర్వహించడం, బసవతారకం ఆసుపత్రికి సహాయాన్ని అందిస్తుండడం గొప్ప విషయం అని బాలకృష్ణ మెచ్చుకున్నారు.

అమెరికాలోని పెన్సిల్వేనియాలో తానా మహాసభలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు తలపెట్టిన ఈ సభలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సభలలో ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించేందుకు నిర్వాహకులు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు.

Tana
mahasabhalu
america
pennsylvania
nandamuri
Balakrishna
  • Loading...

More Telugu News