MBBS Student: మతిస్థిమితం కోల్పోయి.. మర్మాంగం కోసుకుని వైద్య విద్యార్థి ఆత్మహత్య

Secunderabad Gandhi Medical College Student Commits Suicide
  • హైదరాబాద్ శివారులోని పాపిరెడ్డి నగర్‌లో ఘటన
  • గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న దీక్షిత్‌రెడ్డి
  • గతంలో ఒకసారి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్‌లో ఓ వైద్య విద్యార్థి మర్మాంగం కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ శివారులోని పాపిరెడ్డినగర్‌కు చెందిన దీక్షిత్‌రెడ్డి (21) సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో గత కొంతకాలంగా మందులు వాడుతున్నాడు. 

గతంలో ఒకసారి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు సకాలంలో స్పందించడంతో బతికి బయటపడ్డాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మర్మాంగం కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బయటకెళ్లి వచ్చిన కుటుంబ సభ్యులు తలుపుకొట్టినా తీయకపోవడంతో అనుమానించి కిటికీలోంచి చూడగా రక్తపు మడుగులో కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
MBBS Student
Gandhi Medical College
Hyderabad

More Telugu News