Jam Jam Jajjanakka: జాం జాం జజ్జనక... భోళా శంకర్ నుంచి సెలబ్రేషన్ సాంగ్ ప్రోమో రిలీజ్

Chiranjeevi starred Celebration song promo from Bhola Shankar out now

  • చిరంజీవి హీరోగా భోళా శంకర్
  • మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిత్రం
  • పూర్తి పాటను జులై 11న విడుదల చేయనున్న చిత్రబృందం
  • మహతి స్వరసాగర్ సంగీతం
  • ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు భోళా శంకర్

మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం భోళా శంకర్ విడుదలకు ముస్తాబవుతోంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

తాజాగా ఈ చిత్రం నుంచి జాం జాం జాం జాం జజ్జనక... తెల్లార్లూ ఆడుదాం తయ్యితక్క అంటూ హుషారుగా సాగే ఓ సెలబ్రేషన్ సాంగ్ ప్రోమో రిలీజయింది. ఈ పాట పూర్తి లిరికల్ వీడియోను జులై 11న సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. 

భోళా శంకర్ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. ఇటీవల ఈ పాట మేకింగ్ వీడియోను చిత్రబృందం పంచుకుంది. సినిమాలోని ప్రధాన తారాగణమంతా ఈ పాటలో స్టెప్పులేయడం ఆ వీడియోలో కనువిందు చేసింది. 

ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాణ సారథ్యంలో ఈ మాస్ ఎంటర్టయినర్ తెరకెక్కుతోంది. ఇందులో చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా నటిస్తుండగా, చిరంజీవి చెల్లెలుగా కీలకపాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. 

సుశాంత్, తరుణ్ అరోరా, వెన్నెల కిశోర్, మురళీశర్మ, బ్రహ్మాజీ, ఉత్తేజ్,  శ్రీముఖి, గెటప్ శ్రీను, షావర్ అలీ, సితార, కాశీ విశ్వనాథ్, హైపర్ ఆది, వైవా హర్ష, వేణు, సత్య, తాగుబోతు రమేశ్, బిత్తిరి సత్తి ఈ చిత్రంలోని ఇతర తారాగణం.

More Telugu News