Andhra Pradesh: ఏపీకి నేడు, రేపు వర్ష సూచన

Two days rain forecast for AP

  • ఏపీలో గణనీయంగా నైరుతి రుతుపవనాల ప్రభావం
  • పలు జిల్లాల్లో రెండ్రోజుల పాటు వర్షాలు
  • తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్న విపత్తుల నిర్వహణ సంస్థ

ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రభావం గణనీయంగా ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండ్రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపింది. కాకినాడ, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, పల్నాడు, చిత్తూరు, కృష్ణా, అన్నమయ్య, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, కోనసీమ, బాపట్ల, అల్లూరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

ప్రకాశం, నంద్యాల,  శ్రీ సత్యసాయి, నెల్లూరు, అనంతపురం, విజయనగరం, తిరుపతి, అనకాపల్లి జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తాయని వివరించింది. రేపు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Andhra Pradesh
Rains
Monsoon
Weather
APSDMA
  • Loading...

More Telugu News