Samsung: సామ్ సంగ్ నుంచి కొత్త 5జి ఫోన్.. ధర రూ.17 వేలే..!

Samsung launches new smart phone Galaxy M34 5G

  • మార్కెట్ లోకి కొత్త ఫోన్ విడుదల చేసిన కొరియా కంపెనీ
  • సామ్ సంగ్ గ్యాలక్సీ ఎమ్ 34 పేరుతో రిలీజ్
  • అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ లో డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడి 

స్మార్ట్ ఫోన్ల తయారీలో పేరొందిన సౌత్ కొరియా కంపెనీ సామ్ సంగ్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. గ్యాలక్సీ ఎమ్ 34 తో విడుదల చేసిన ఈ 5జి ఫోన్ ను తక్కువ ధరకే ప్రజలకు అందించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే లాంచ్‌ చేసిన ఈ ఫోన్లను.. ఈ నెల 15 నుంచి ఈ కామర్స్‌ సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్ కూడా ప్రకటించినట్లు వివరించింది. ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ.16,999 కాగా, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ.18,999 లు గా నిర్ణయించింది.

గ్యాలక్సీ ఎమ్ 34 ఫీచర్లు..
  • 6.6 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ సూపర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే
  • ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌
  • 5nm Exynos 1280 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది 
  • 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ
  • 50 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా

Samsung
smart phone
Galaxy M34 5G
business
new phone
budget phones
  • Loading...

More Telugu News