: కుప్పకూలిన టీమిండియా టాపార్డర్


ఛాంపియన్స్ ట్రోఫీ రెండో సన్నాహక మ్యాచ్ లో ఆసీస్ బౌలర్ల ధాటికి భారత జట్టు టాపార్డర్ కుప్పకూలింది. తొలి సన్నాహక మ్యాచ్ లో శ్రీలంక బౌలర్లను ఆటాడుకున్న టీమిండియా బ్యాట్స్ మన్, ఆసీస్ తో మ్యాచ్ లో చేతులెత్తేశారు. 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడ్డారు. ధోనీ 31 పరుగులతోనూ, దినేష్ కార్తిక్ 27 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీ సేన ఆసీస్ పేస్ ధాటికి విలవిల్లాడింది.

కేవలం నాలుగు పరుగులకే మురళీవిజయ్(1) ను మిచెల్ స్టార్క్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం 9 పరుగులు చేసిన కోహ్లీని 15 పరుగల స్కోరు వద్ద స్టార్క్ బలితీసుకున్నాడు. తరువాత 39 పరుగుల వద్ద రోహిత్ శర్మ (10)ను మెక్ కే బౌల్డ్ చేసాడు. అదే ఓవర్లో చివరి బంతికి రైనా(0) కూడా బౌల్డయ్యాడు. తరువాత 55 పరుగుల వద్ద శిఖర్ ధావన్ 17 పరుగులు చేసి వెనుదిరిగాడు. దీంతో 28 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి టీమిండియా 118 పరుగులు చేసింది. ధోనీ, కార్తిక్ క్రీజులో కుదురుకున్నారు.

  • Loading...

More Telugu News