PV Sindhu: మళ్లీ సెమీఫైనల్లోనే ఓడిన పీవీ సింధు

PV Sindu loses in canada open semifinal

  • కెనడా ఓపెన్ లో యమగూచి చేతిలో పరాజయం
  • ఫైనల్ చేరిన లక్ష్యసేన్
  • సెమీస్ లో జపాన్ స్టార్ నిషిమోటాపై గెలుపు

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరోసారి నిరాశ పరిచింది. కెనడాలోని కాల్గరీలో జరుగుతున్న కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో  సెమీఫైనల్లో ఓడిపోయింది. యువ షట్లర్ లక్ష్యసేన్ పురుషుల సింగిల్స్ లో ఫైనల్ చేరుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన మహిళల సింగిల్స్ సెమీపైనల్లో జపాన్ కు చెందిన అకానె యమగూచి 21-14, 21-15తో పీవీ సింధును వరుస గేమ్స్ లో చిత్తు చేసింది. దాంతో, చాన్నాళ్లుగా ఓ టైటిల్ ఆశిస్తున్న సింధుకు మరోసారి నిరాశే ఎదురైంది.

మరోవైపు, లక్ష్యసేన్ దాదాపు ఏడాది తర్వాత తొలి బీడబ్ల్యూఎఫ్ టోర్నీలో ఫైనల్ చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో లక్ష్యసేన్ 21-17, 21-14తో జపాన్ కు చెందిన స్టార్ షట్లర్, నాలుగో సీడ్ కెంటా నిషిమోటోపై వరుస గేమ్స్ లో అద్భుత విజయం సాధించాడు. ఫైనల్లో అతను చైనాకు చెందిన లీ షిఫెంగ్ తో పోటీ పడనున్నాడు.

PV Sindhu
badminton
lose
canada opent
  • Loading...

More Telugu News