MS Dhoni: పెంపుడు కుక్కలే గెస్టులు... వెరైటీగా ధోనీ బర్త్ డే పార్టీ!

Dhoni birthday party with pets

  • జులై 7న ధోనీ పుట్టినరోజు
  • అత్యంత నిరాడంబరంగా బర్త్ డే జరుపుకున్న ధోనీ
  • ఫామ్ హౌస్ లో పెంపుడు కుక్కల నడుమ కేక్ కట్ చేసిన వైనం

భారత క్రికెట్ జట్టును అంతర్జాతీయ స్థాయిలో బలమైన శక్తిగా నిలిపిన వారిలో మహేంద్ర సింగ్  ధోనీ ఒకడు. ధోనీ నాయకత్వంలో టీమిండియా టీ20, వన్డే ఫార్మాట్లలో వరల్డ్ కప్ లు గెలవడమే కాదు, టెస్టుల్లోనూ అగ్రస్థానానికి చేరింది.

ఒక్కమాటలో చెప్పాలంటే టీమిండియా క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ధోనీ. ఐపీఎల్ లోనూ ధోనీ హవా మామూలుగా ఉండదు. ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ కు ఐదో టైటిల్ అందించడం ధోనీ కెరీర్ కు మరింత వన్నె తెచ్చింది. 

ఇలా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ సాధారణ జీవితం గడపడమే ధోనీకి ఇష్టం. అందుకు నిదర్శనమే ఈ పుట్టినరోజు వీడియో. ధోనీ నిన్న (జులై 7) 42వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఎంత నిరాడంబరంగా అంటే, కేవలం ఓ పావు కేజీ బరువుండే కేక్ ను కట్ చేశాడు. పెంపుడు కుక్కలే గెస్టులుగా ఈ బర్త్ డే పార్టీ సాగింది. 

చిన్న బల్లపై ఉంచిన కేక్ ను కట్ చేసిన ధోనీ... చిన్న ముక్కలను తన కుక్కలకు గాల్లోకి విసరగా, అవి ఎగిరి అందుకున్నాయి. ఆపై తాను కూడా ఒకట్రెండు కేక్ ముక్కలు తినేసి ఈ ఏడాదికి బర్త్ డే వేడుకలను ముగించాడు. ఈ సింపుల్ సెలబ్రేషన్ కు ధోనీ ఫామ్ హౌస్ వేదికగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

MS Dhoni
Birthday
Cake
Pet Dogs
Team India
IPL

More Telugu News