G Jagadish Reddy: ఆ మాత్రం రైలు వ్యాగన్లు తయారుచేసే సత్తా మాకు కూడా ఉంది: మంత్రి జగదీశ్ రెడ్డి

We have capability of making wagons says Jagadish Reddy

  • వరంగల్ కు వచ్చి మోదీ ఇచ్చిందేమీ లేదన్న జగదీశ్ రెడ్డి
  • అవినీతికి రారాజు బీజేపీ అని విమర్శ
  • కేసీఆర్ కీర్తి ఢిల్లీకి పాకుతుందని మోదీ భయపడుతున్నారని ఎద్దేవా

ప్రధాని మోదీ వరంగల్ పర్యటనపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ... వరంగల్ కు వచ్చి మోదీ ఇచ్చిందేమీ లేదని అన్నారు. రాష్ట్రానికి మొండి చేయి చూపించి... బీఆర్ఎస్ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కి పోయారని చెప్పారు. ఈ మాత్రం రైలు వ్యాగన్లు తయారు చేసే సత్తా తమకు కూడా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కీర్తి ఢిల్లీకి తాకుతుందని మోదీ భయపడుతున్నారని చెప్పారు. 

అవినీతిలో కాంగ్రెస్ ను బీజేపీ మించిపోయిందని జగదీశ్ రెడ్డి విమర్శించారు. అవినీతికి రాజు కాంగ్రెస్ అయితే... రారాజు బీజేపీ అని చెప్పారు. గుజరాత్ లో కూలిన బ్రిడ్జిలే బీజేపీ అవినీతికి సాక్ష్యమని అన్నారు. తెలంగాణ కంటే గుజరాత్ లో అవినీతి ఎక్కువని... అయినప్పటికీ అక్కడకు ఈడీ, సీబీఐ ఎందుకు వెళ్లవని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని... అందుకే ఇక్కడ బీజేపీకి స్థానం లేదని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ లు ఈ దేశాన్ని నాశనం చేశాయని మండిపడ్డారు.

More Telugu News