Spain: స్పెయిన్ లో కార్లను కూడా నెట్టుకెళ్లిన వరద నీరు... వీడియో ఇదిగో!

Flash floods hit northeast parts in Spain

  • స్పెయిన్ లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు
  • ఈశాన్య స్పెయిన్ లో వరద బీభత్సం
  • జరాగోజా నగరంలో రోడ్లను ముంచెత్తిన వరద నీరు
  • ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కార్ల టాప్ పైకి చేరిన ప్రజలు

యూరప్ దేశం స్పెయిన్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు స్పెయిన్ లో వరదలు సంభవిస్తున్నాయి. స్పెయిన్ ఈశాన్య ప్రాంతంలోని జరాగోజా నగరంలోనూ వరద బీభత్సం నెలకొంది.  

తాజాగా, అక్కడ ఓ రహదారిని వరద ముంచెత్తగా, కార్లు సైతం వెనక్కి కొట్టుకుపోతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. కార్లలోని వారు నిస్సహాయంగా చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిని ఆ వీడియోలో చూడొచ్చు. 

రోడ్డుపైకి దూసుకొచ్చిన వరద నీరు కార్లను ఆటబొమ్మల్లా నెట్టుకుంటూ వెళుతుండగా, ప్రజల కార్ల టాప్ పైకి చేరుకుని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. వారిలో కొందరు వరద ఉద్ధృతి కారణంగా గల్లంతైనట్టుగా తెలుస్తోంది.

More Telugu News