Jagan: మీ స్ఫూర్తి ప్రతిక్షణం నన్ను చేయిపట్టి నడిపిస్తోంది: జగన్ భావోద్వేగం

Jagan emotional tweet on YS Rajasekhar Reddy Jayanthi

  • నేడు వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి
  • ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని మీరు తపించారన్న జగన్
  • మీ జయంతి తమకందరికీ ఒక పండుగ రోజు అని ట్వీట్

నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి. ఈ సందర్భంగా ఆయన తనయుడు, సీఎం జగన్ భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా... అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరం చేసిందని చెప్పారు. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి తనను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోందని అన్నారు. మీ జయంతి తమకందరికీ ఒక పండుగ రోజు అని భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు.

More Telugu News