microsoft: మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ రాజీనామా

Microsoft India prez Anant Maheshwari steps down

  • అనంత్ స్థానంలో పునీత్ చందోక్‌కు బాధ్యతలు!
  • 2016లో మైక్రోసాఫ్ట్‌లో చేరిన అనంత్ మహేశ్వరి
  • హానీవెల్,  మెకెన్సీ అండ్ కంపెనీలలోను పని చేసిన అనంత్

మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను మైక్రోసాఫ్ట్ ధ్రవీకరించింది. భారత్ లో తమ వ్యాపారాభివృద్ధికి అనంత్ చేసిన సేవలకు ధన్యవాదాలు... ఆయన భవిష్యత్తు ప్రయత్నాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నామంటూ మైక్రోసాఫ్ట్ ఓ ప్రకటనను విడుదల చేసింది. అనంత్ స్థానంలో కొత్త ప్రెసిడెంట్ గా పునీత్ చందోక్ బాధ్యతలు చేపట్టనున్నారని తెలుస్తోంది.

మైక్రోసాఫ్ట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ఉన్న ఐరినా ఘోష్ ను మైక్రోసాఫ్ట్ ఇండియా విభాగం మేనేజింగ్ డైరెక్టర్ గా నియమిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. మేనేజింగ్ డైరెక్టర్ శశి శ్రీధరన్ కు ఉన్నతస్థాయి బాధ్యతలు అప్పగించనన్నారు.

ఇక, అనంత్ మహేశ్వరి 2016లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. మైక్రోసాఫ్ట్ కంటే ముందు హానీవెల్ ఇండియా ప్రెసిడెంట్ గా, మెకెన్సీ & కంపెనీ ఎంగేజ్‌మెంట్ మేనేజర్ గా పని చేశారు. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుండి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. బిట్స్ పిలానీ నుండి మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పూర్తి చేశారు. అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లోను చదివారు.

  • Loading...

More Telugu News