YS Jagan: ఎమ్మెల్యేల పనితీరుపై ఐప్యాక్ టీమ్‌తో జగన్ భేటీ

YS Jagan meeting with IPAC team

  • తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన ఐప్యాక్ ఇంఛార్జ్
  • ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై చర్చ
  • గ్రాఫ్ తగ్గిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లో విభేదాలతో పాటు ఇంఛార్జ్‌‌ల మార్పుపై చర్చ

రాజకీయ సలహాల సంస్థ ఐప్యాక్ టీమ్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. వైసీపీకి ఐప్యాక్ సలహాలు అందిస్తోన్న విషయం తెలిసిందే. శుక్రవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఐప్యాక్ టీమ్ ఇంఛార్జ్ రిషిరాజ్, సహ సభ్యులు, వైసీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై చర్చించారు. నియోజకవర్గాల్లో పార్టీ తాజా పరిస్థితిపై విశ్లేషించారు.

గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష కార్యక్రమం తీరుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ కార్యక్రమాలలో మంత్రులు, ఎమ్మెల్యేల భాగస్వామ్యం, పనితీరుపై చర్చించారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఐప్యాక్ టీమ్ నివేదిక ఇవ్వగా, దీనిపై జగన్ చర్చించారని తెలుస్తోంది. గ్రాఫ్ తగ్గిన ఎమ్మెల్యేలు, వివిధ నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు వంటి అంశాలతో పాటు ఆయా నియోజకవర్గ ఇంఛార్జ్‌ల మార్పుపై చర్చ జరిపారని తెలుస్తోంది.

YS Jagan
Jagan
YSRCP
Andhra Pradesh
IPAC
  • Loading...

More Telugu News