Mark Zuckerberg: ఫ్యామిలీ ఫొటో షేర్ చేసిన జుకర్‌బర్గ్.. పిల్లల ముఖం మాత్రం కనిపించనివ్వలేదు.. మనం చేయాల్సిందీ ఇదే!
- తన కూతుళ్ల ముఖాలను ఎమోజీలతో కవర్ చేసిన జుకర్ బర్గ్
- గతంలోనూ ఇలానే జాగ్రత్త పడిన మెటా సీఈవో
- తన కూతుళ్ల ప్రైవసీని ఆయన కాపాడుకుంటున్నారని నెటిజన్ల కామెంట్లు
- తీవ్ర విమర్శలు చేస్తున్న మరికొందరు
ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్.. ప్లాట్‌ఫామ్ ఏదైనా యూజర్లు వందల కోట్లలో ఉన్నారు. లైక్‌ల కోసం, వ్యూస్ కోసం ఒక్కొక్కరి పాట్లు అన్నీ ఇన్నీ కావు.. ఇక పిల్లల చానల్స్ కోకొల్లలు. చిన్న పిల్లల ఫొటోలు, వీడియోలను పేరెంట్స్ ఇష్టానుసారంగా షేర్ చేస్తుంటారు.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. ఇప్పుడు ‘థ్రెడ్స్’ను తీసుకొచ్చిన ‘మెటా’ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ షేర్ చేసిన తన ఫ్యామిలీ ఫొటోను చూడండి. తన కూతుళ్ల ముఖాలు కనిపించకుండా ఎలా కవర్ చేశారో! స్మైలీ ఎమోజీలు పెట్టి పిల్లల ముఖాల్ని కవర్ చేశారు. ఇప్పుడే కాదు.. ఎన్నడూ తమ పిల్లల ముఖాలను సోషల్ మీడియాలో వాళ్లు చూపలేదు. ఫోటోలను షేర్ చేసినా.. ముఖాలు కనిపించకుండా జాగ్రత్తపడతారు. ఎందుకు?
సోషల్ మీడియాలో సరదా ఉండొచ్చు కానీ.. అవి అంత సురక్షితం కాదు. పైకి అంతా బాగానే కనిపిస్తుంది.. కానీ మనకు బయటికి కనిపించని చీకటి కోణాలెన్నో. తమ పిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎంతో మంది తల్లిదండ్రులు భయానక అనుభవాలను ఎదుర్కొన్నారు. యూట్యూబ్ సహా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల అల్గారిథమ్స్.. తరచుగా తమ పిల్లలకు సంబంధించిన పోస్ట్‌లు లేదా వీడియోలు వైరల్ చేస్తున్నాయని వారు చెప్పారు.
సోషల్ మీడియోలో షేర్ చేసిన ఫొటోలు, వీడియోల ద్వారా తమను టార్గెట్ చేసినట్లు కూడా పేరెంట్స్ చెప్పారు. అభ్యంతరకర వీడియోలు, ఫొటోలకు తమ పిల్లల ఫొటోలను జత చేస్తున్నట్లు కొందరు వాపోయారు. మార్ఫింగ్‌లు, ఎడిట్లకు లెక్కే లేదు. తమ స్వార్థపూరిత అవసరాలకు అనుగుణంగా ఆయా ఫొటోలను చాలా మంది యూజర్లు ఇష్టానుసారం మారుస్తుంటారు. ఇలాంటి సంఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం.
సోషల్ మీడియోలో షేర్ చేసిన ఫొటోలు, వీడియోల ద్వారా తమను టార్గెట్ చేసినట్లు కూడా పేరెంట్స్ చెప్పారు. అభ్యంతరకర వీడియోలు, ఫొటోలకు తమ పిల్లల ఫొటోలను జత చేస్తున్నట్లు కొందరు వాపోయారు. మార్ఫింగ్‌లు, ఎడిట్లకు లెక్కే లేదు. తమ స్వార్థపూరిత అవసరాలకు అనుగుణంగా ఆయా ఫొటోలను చాలా మంది యూజర్లు ఇష్టానుసారం మారుస్తుంటారు. ఇలాంటి సంఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం.
అందుకే మార్క్ జుకర్‌బర్గ్, బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ తదితరులు తమ పిల్లల్ని సోషల్ మీడియాకు దూరంగా ఉంచారు. యాపిల్ ప్రస్తుత సీఈవో టిమ్ కుక్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘‘నాకు పిల్లలు లేరు. కానీ మేనల్లుడు (నెఫ్యూ) ఉన్నాడు. నేను అతడికి కొన్ని హద్దులు పెట్టాను. కొన్నింటికి నేను అనుమతించను. సోషల్ నెట్‌వర్క్‌లో ఉండాలని నేను కోరుకోను” అని చెప్పడం గమనార్హం.
జుకర్‌బర్గ్ షేర్ చేసిన ఫొటోపై కొందరు పాజిటివ్‌గా, మరికొందరు నెగటివ్‌గా స్పందిస్తున్నారు. తన కూతుళ్ల ప్రైవసీని ఆయన కాపాడుకుంటున్నారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో జుకర్‌బర్గ్ క్యారెక్టర్‌నే తప్పుబడుతున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పేరుతో ఫొటోలు, వీడియోల షేరింగ్ ప్లాట్‌ఫామ్ పెట్టి.. తన పిల్లల ముఖాలను మాత్రం దాచుకుంటున్నారని మండిపడుతున్నారు.
కానీ ఒక్క విషయం.. ఏకంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టా అధినేతనే తన కూతుర్ల ముఖాలు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారంటే.. మనం ఎంత జాగ్రత్త పడాలి? అయినా ఎవరిష్టం వారిది.
సిగరెట్ అమ్మేవాళ్లు వాటిని తాగాలని ఉందా? గుట్కా అమ్మేవాళ్లు గుట్కా తినాలని ఉందా? వైన్స్ వ్యాపారం చేస్తూ లిక్కర్ అమ్మే వాళ్లు మందు తాగాలని ఉందా? ఎవరి విచక్షణ మేరకు వాళ్లు నడుచుకోవాలంతే. కాదంటారా?