Falaknuma Express: ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ప్రమాదం: దక్షిణ మధ్య రైల్వేకు బెదిరింపు లేఖ రాసిన అనుమానితుడి అరెస్టు
- బీహెచ్ఈఎల్కు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- బెదిరింపు లేఖపై విచారణ..
- అతనే రాశాడా, ఇంకెవరైనా రాశారా అనే కోణంలోనూ దర్యాప్తు
ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు అగ్నిప్రమాదం ఘటన నేపథ్యంలో.. దక్షిణ మధ్య రైల్వేకు ఇటీవల బెదిరింపు లేఖ రాసిన అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బీహెచ్ఈఎల్కు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ బెదిరింపు లేఖపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ లేఖను అతనే రాశాడా, లేక ఇంకెవరైనా రాశారా? కారణమేంటి? ఇందులో కుట్రకోణం ఏమైనా ఉందా? వంటి విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.
జూన్ 30వ తేదీన దక్షిణ మధ్య రైల్వేకు బెదిరింపు లేఖ అందింది. ఒడిశాలోని బాలాసోర్ తరహాలో ఢిల్లీ- హైదరాబాద్ రూట్లో రైలు ప్రమాదం జరిగే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై రైల్వే అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.