Komali Prasad: మనసులు దోచేస్తున్న అందాల కోమలి .. కోమలి ప్రసాద్ లేటెస్ట్ పిక్స్!

Komali Prasad Special

  • వెండితెరపై విరిసిన తెలుగందం 
  • అభినయంలోను మంచి మార్కులు 
  • సరైన బ్రేక్ కోసమే వెయిటింగ్ 
  • కుర్రాళ్ల మనసులు కొల్లగొడుతున్న కోమలి లేటెస్ట్ పిక్స్


తెలుగు తెరపై కనిపించడం తెలుగు హీరోయిన్స్ కి చాలా కష్టమైన విషయం. తెలుగు అమ్మాయిలకు గ్లామర్ ఒలకబోసే విషయంలో కొన్ని పరిధులు .. పట్టింపులు ఉంటాయి. అందువలన తెలుగు అమ్మాయిలకు హీరోయిన్ గా అవకాశాలు ఇవ్వడానికి చాలామంది ఆలోచన చేస్తారు. ఈ కారణంగానే కొంతమంది తెలుగు హీరోయిన్స్ వెనకబడిపోతున్నారు. కావాల్సినంత అందం .. అవసరమైనంత అభినయం ఉన్నప్పటికీ అవకాశాల కోసం అలా వెయిట్ చేస్తూ ఉన్నారు.  అలాంటి కథానాయికలలో కోమలి ప్రసాద్ ఒకరుగా కనిపిస్తోంది. కోమలి ప్రసాద్ 2016 నుంచే నటన దిశగా అడుగులు వేస్తూ వెళుతోంది. వచ్చిన అవకాశాలను వదులుకోకుండా, సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తూనే వెళుతోంది. చిన్న సినిమాలతోనే తన కెరియర్ మొదలైనప్పటికీ, నిదానంగా ప్రాధాన్యత కలిగిన పాత్రలను అందిపుచ్చుకుంటూ, ఆ పాత్రలలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 'రౌడీ బాయ్స్' .. 'సెబాస్టియన్' వంటి సినిమాలతో ఆమె మరో రెండు అడుగులు ముందుకు వేసింది. 'హిట్ 2' సినిమాలో మాత్రం మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ అయినప్పటికీ, కోమలి చేసిన 'వర్ష' పాత్ర ఎక్కువగా ఆకట్టుకుంది. వైజాగ్ కి చెందిన ఈ బ్యూటీ, తన టాలెంట్ ను పూర్తి స్థాయిలో చూపించే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తోంది. విశాలమైన కళ్లతో విన్యాసాలు చేసే ఈ సుందరి, ఆకర్షణీయమైన నవ్వుతో అలా కట్టిపడేస్తుందంతే. కోమలి లేటెస్ట్ గా వదిలిన పిక్స్ చూస్తే, ఆమె అభిమానులుగా పేరు నమోదు చేసుకోకుండా తప్పించుకోవడం చాలా కష్టం. కాస్త ఆలస్యమైనా ఈ కోమలికి అవకాశాలు వరుసగా వచ్చి పడటం ఖాయమని అనుకోకుండా ఉండటం కూడా కష్టమే.

Komali Prasad
Actress
Tollywood
  • Loading...

More Telugu News