Sana Khan: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సనాఖాన్

Sana Khan became mother

  • కల్యాణ్ రామ్, మంచు మనోజ్ సరసన నటించిన సనా ఖాన్
  • 2020లో అనాస్ అహ్మద్ ను పెళ్లాడిన సనా
  • కెరీర్ బాగున్నప్పుడే సినిమాలకు గుడ్ బై చెప్పిన బాలీవుడ్ భామ

బాలీవుడ్ హీరోయిన్ సనాఖాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. కల్యాణ్ రామ్ చిత్రం 'కత్తి'తో ఆమె టాలీవుడ్ కు పరిచయమయింది. మంచు మనోజ్ 'మిస్టర్ నూకయ్యా' చిత్రంలో కూడా నటించింది. 2005లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సనా ఖాన్ తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో నటించింది. 2020లో అనాస్ సయ్యద్ ను ఆమె పెళ్లి చేసుకుని సినిమాలకు విరామం ప్రకటించింది. కెరీర్ బాగున్నప్పుడే సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. 

తాజాగా సనాఖాన్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తాను తల్లి అయినట్టు ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. తమపై ప్రేమాభిమానాలు చూపుతున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పింది. మీ దీవెనలు తమ బిడ్డపై కూడా ఉండాలని కోరింది. మరోవైపు తల్లి అయిన సనాకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  

Sana Khan
Bollywood
Tollywood
  • Loading...

More Telugu News