Sitara: యాడ్ కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకున్న మహేశ్ బాబు కూతురు సితార

Sitara remuneration for Ad

  • అప్పుడే పెద్ద సెలబ్రిటీ స్టేటస్ ను సాధించిన సితార
  • తాజాగా ఒక జ్యువెలరీ యాడ్ లో నటించిన మహేశ్  కూతురు
  • ఈ యాడ్ కు రూ. కోటి రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమార్తె సితార అప్పుడే ఒక పెద్ద సెలెబ్రిటీ స్టేటస్ ను, సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సాధించింది. ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు దాదాపు 1 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. ఇటీవలే సితార ఒక జ్యువెలరీ కంపెనీ కమర్షియల్ యాడ్ లో నటించింది. ఈ యాడ్ ను న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లోని బిల్ బోర్డుపై కూడా ప్రదర్శించారు. 

మరోవైపు ఈ యాడ్ కు సితార ఎంత రెమ్యునరేషన్ తీసుకుందనే చర్చ కూడా జరుగుతోంది. సదరు జ్యువెలరీ సంస్థ సితారకు కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చిందని చెపుతున్నారు. చాలా మంది హీరోయిన్లకు కూడా ఇంత రెమ్యునరేషన్ ఉండదనే విషయం తెలిసిందే.

Sitara
Mahesh Babu
AD
Remuneration
  • Loading...

More Telugu News