Ambati Rambabu: అంబటి రాంబాబుకు షాక్.. టీడీపీలో చేరిన ప్రధాన అనుచరుడు

Ambati Rambabu key follower Bathula Adinarayana joins TDP
  • టీడీపీలో చేరిన సత్తెనపల్లి వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు బత్తుల ఆదినారాయణ
  • ఉమ్మడి గుంటూరు జిల్లా కాపునాడు అధ్యక్షుడిగా కూడా పని చేసిన బత్తుల
  • పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కన్నా లక్ష్మీనారాయణ
ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు పెద్ద షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు, సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది బత్తుల ఆదినారాయణ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. ఆదినారాయణ కాపునాడు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కూడా పని చేశారు. బత్తుల ఆదినారాయణ టీడీపీలో చేరడం సత్తెనపల్లి వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. 

ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... ఆదినారాయణ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారని చెప్పారు. ఆయనను టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించామని తెలిపారు. అందరినీ కలవగలిగిన, కలపగలిగిన ప్రముఖ న్యాయవాది, కాపు సంఘం అధ్యక్షుడు ఆదినారాయణను టీడీపీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరినందుకు వారిని తాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాని చెప్పారు. రాష్ట్రానికి వైసీపీ రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించడానికి, టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రజలతో పాటు, మేదావులు అందరం కలిసి పని చేద్దామని చెప్పారు.  

Ambati Rambabu
Bathula Adinarayana
YSRCP
Sattenapalle
Kanna Lakshminarayana
Telugudesam

More Telugu News