Salaar Teaser: ట్విట్టర్ ను ఊపేస్తున్న 'సలార్'.. టాప్ ట్రెండింగ్ లో ప్రభాస్ మూవీ టీజర్

Prabhas Salaar teaser trending in first place in Twitter

  • ఉదయం విడుదలైన 'సలార్' టీజర్
  • భారీ యాక్షన్ సన్నివేశాలతో ఉత్కంఠను రేపుతున్న టీజర్
  • ట్విట్టర్ లో లక్షలాది హిట్స్ తో వైరల్ అవుతున్న టీజర్

ప్రపంచ వ్యాప్తంగా రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న 'సలార్ పార్ట్ 1 - సీజ్ ఫైర్' టీజర్ విడుదలయింది. 'కేజీఎఫ్' చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడిన వెంటనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఈ ఉదయం 5.12 గంటలకు టీజర్ ను విడుదల చేశారు. అందరూ ఊహించినట్టే ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. 'బాహుబలిని' మించి ప్రభాస్ ను ఎలివేట్ చేసేలా ఈ చిత్రం ఉందనే విషయం టీజర్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు 'సలార్' టీజర్ ట్విట్టర్ ను షేక్ చేస్తోంది. టీజర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వెంటనే వైరల్ అయింది. ట్విట్టర్ ఇండియాలో టాప్ పొజిషన్ ట్రెండ్ అవుతోంది. ప్రభాస్ కూడా టాప్ 2 పొజిషన్ లో ట్రెండ్ అవుతున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 28న తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.  

సలార్ ట్విట్టర్ ట్రెండింగ్:

More Telugu News