Anil Kumar Yadav: లోకేశ్‌కు అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్! వెంకటేశ్వరస్వామి వద్ద ప్రమాణానికి సిద్ధమని ప్రకటన

former minister anil kumar responds to allegations levelled by TDP leader nara lokesh

  • టీడీపీ నేత లోకేశ్ ఆరోపించినంత భూమి తనకు లేదన్న మాజీ మంత్రి అనిల్ 
  • ఉన్న భూమిలో కొంత భాగాన్ని కూడా అమ్మేశానంటూ వివరణ
  • చెన్నైలో అద్దె ఇంట్లో ఉంటున్నానని వెల్లడి
  • ఈ అంశంపై లోకేశ్‌తో చర్చకు ఎప్పుడైనా రెడీ ఉంటూ స్పష్టీకరణ 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో చేసిన ఆరోపణలపై వైసీపీ మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. తన తండ్రి ఇచ్చిన ఆస్తి కంటే రూపాయి ఎక్కువ ఉన్నా వెంకటేశ్వరస్వామి వద్ద ప్రమాణం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. నెల్లూరులో పాదయాత్ర సందర్భంగా అనిల్ రూ.వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు సంపాదించారని లోకేశ్ ఆరోపించారు. 

నగరంలో తనకు 80 ఎకరాలు ఉందని ఆరోపించారని, కానీ అక్కడ 13 ఎకరాలు మాత్రమే ఉందని అనిల్ చెప్పారు. అందులో కూడా కొంత భాగాన్ని అమ్మేశానని వెల్లడించారు. ఇరుగాళమ్మ గుడి వద్ద 3 ఎకరాలు విక్రయించానని, వైసీపీ కార్పొరేటర్లు లేఅవుట్లు వేస్తే తనకేం సంబంధమని ప్రశ్నించారు. తన పేరిట ఉన్న రూ.50 కోట్ల ఇల్లు ఎక్కడుందో చెబితే అక్కడకు వెళ్లి చేరతానన్నారు. చెన్నైలో తాను అద్దె ఇంట్లో ఉంటున్నట్టు చెప్పుకొచ్చారు.  లోకేశ్‌తో చర్చకు సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పారు. 

కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఓడించాలంటూ మాజీ మంత్రి నారాయణ రూ.50 లక్షలు పంపిస్తే తాను వాటిని వెనక్కు పంపించేశానని అనిల్ చెప్పారు. ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడట్లేదని వాపోయారు. టీడీపీ సమావేశంలో వేదికపై ఉన్న నేతలే అక్రమార్కులనీ, వైసీపీ నుంచి వచ్చిన వారు టీడీపీలో చేరగానే పునీతులయ్యారా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News