Sri Simha: 'భాగ్ సాలే' టీమ్ తో బండ్ల గణేశ్!

Bhaag Saale Movie Team Interview

  • సింహ కోడూరి హీరోగా రూపొందిన 'భాగ్ సాలే' 
  • ఈ నెల 7న థియేటర్లకు రానున్న సినిమా 
  • నిజామ్ కాలం నాటి ఉంగరం చుట్టూ తిరిగే కథ
  • నాన్ స్టాప్ గా నవ్విస్తుందని చెప్పిన సింహ

సింహ కోడూరి హీరోగా 'భాగ్ సాలే' సినిమా రూపొందింది. బిగ్ బెన్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి ప్రణీత్ దర్శకత్వం వహించాడు. నేహా సోలంకి కథానాయికగా నటించిన ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు.  ఈ నెల 7వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ను బండ్ల గణేశ్ ఇంటర్వ్యూ చేశాడు. దర్శకుడు ప్రణీత్ మాట్లాడుతూ .. "ఈ సినిమాకి శ్రీ సింహనే టైటిల్ ఇచ్చాడు. బలమైన ఫ్యామిలీ నేపథ్యం నుంచి వచ్చిన హీరోగా ఆయనకి ఎంతమాత్రం ఇగో లేదు. సింపుల్ గా ఉంటూ అందరితో కలిసిపోతూ ఉంటాడు. ఈ కథ అంతా కూడా నిజాం కాలానికి చెందిన ఒక 'ఉంగరం' చుట్టూ తిరుగుతుంది" అని చెప్పాడు.

శ్రీ సింహ మాట్లాడుతూ .. "ఇంతవరకూ నేను ఎక్కువగా కామెడీని టచ్ చేసింది ఈ సినిమాలోనే. ఈ సినిమాకి వచ్చినవారు హాయిగా నవ్వుకుంటూ వెళతారు. ఎవరికి వారు రింగ్ ను దొరకబుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు వినోదభరితంగా ఉంటాయి. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.

Sri Simha
Neha Solanki
Kalabhairava
  • Loading...

More Telugu News