Allu Arjun: అసలు సిసలు ఎంటర్టయినర్.. 'సామజవరగమన'పై అల్లు అర్జున్ ప్రశంసలు

Samajavaragamana Movie Update

  • జూన్ 29న విడుదలైన 'సామజవరగమన'
  • తొలిరోజునే దక్కిన హిట్ టాక్
  • లాభాల బాట పట్టిన సినిమా 
  • టీమ్ ను అభినందించిన అల్లు అర్జున్  

శ్రీవిష్ణుకి కామెడీపై మంచి పట్టుంది .. ఇక ఒకప్పుడు హాస్య కథానాయకుడిగా తన హవాను కొనసాగించినవాడు నరేశ్ .. ఇప్పుడు స్టార్ కమెడియన్ గా వెలుగుతున్నవారి జాబితాలో ముందున్నవాడు వెన్నెల కిశోర్. ఈ ముగ్గురూ కలిసి హాస్యప్రధానమైన ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందనడానికి నిదర్శనమే 'సామజవరగమన'.

జూన్ 29వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. రాజేశ్ దండా నిర్మించిన ఈ సినిమాకి, రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. విడుదల రోజునే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా నిలిచింది. ఆల్రెడీ లాభాల బాట పట్టింది. 

ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ .. "చాలా కాలం తరువాత వచ్చిన అసలు సిసలు ఎంటర్టయినర్ గా ఈ సినిమా నిలిచిపోతుంది. మొదటి నుంచి చివరివరకూ కూడా ఈ సినిమా హాయిగా నవ్వించింది. రామ్ అబ్బరాజు ఈ సినిమాను గొప్పగా తెరకెక్కించాడు. శ్రీవిష్ణు .. నరేశ్ .. వెన్నెల కిశోర్ .. రెబా మోనికా జాన్ నటన చాలా బాగుంది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు" అంటూ రాసుకొచ్చాడు. 

More Telugu News