Manchu Manoj: జగపతిబాబు బాటలో మంచు మనోజ్?

Manchu Manoj to act in negative role

  • సరికొత్త ఇన్నింగ్స్ ను ప్రారంభించబోతున్న మనోజ్
  • విలన్ గా నటించబోతున్న మంచు హీరో
  • రవితేజ, విష్వక్సేన్ ల చిత్రంలో ప్రతినాయకుడి పాత్రను పోషించబోతున్నట్టు సమాచారం

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. జగపతిబాబు అడగుజాడల్లో నడవబోతున్నాడు. త్వరలోనే విలన్ గా నటించబోతున్నాడని ఫిలిం నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రవితేజ, విష్వక్సేన్ లు హీరోలుగా సందీప్ రాజ్ ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రంలో రవితేజ, విష్వక్సేన్ లు గురు, శిష్యులుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో విలన్ క్యారక్టర్ ను మంచు మనోజ్ చేస్తున్నట్టు సమాచారం. మనోజ్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చెపుతున్నారు. పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

Manchu Manoj
Tollywood
Negative role
  • Loading...

More Telugu News