Chiranjeevi: చిరూ ఫాంటసీ మూవీ లైన్ ఇదేనంటూ టాక్!

Megastar Upcoming Movies

  • రిలీజ్ కి రెడీగా ఉన్న 'భోళాశంకర్'
  • మరో రెండు ప్రాజెక్టులను సెట్ చేసుకున్న చిరూ 
  • వశిష్ఠ దర్శకత్వంలో చేయనున్న ఫాంటసీ మూవీ 
  • 8 మంది కథానాయికలు ప్రత్యేక ఆకర్షణ

ఒక వైపున చిరంజీవి 'భోళా శంకర్' రిలీజ్ కి రెడీ అవుతుంటే, మరో వైపున రెండు ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాయి. 'బింబిసార' దర్శకుడు శ్రీ వశిష్ఠ దర్శకత్వంలోను చిరంజీవి ఒక సినిమా చేయనున్నారు. ఇది ఫాంటసీ జోనర్లో నడిచే కథ. ఇందులో ఎనిమిది మంది కథానాయికలు కనిపించనున్నారు. 

ఈ సినిమాలో హీరో మనసు దోచుకున్న హీరోయిన్, హఠాత్తుగా ఒక రోజున అదృశ్యమైపోతుంది. కొన్ని శక్తులు ఆమెను వేరే లోకానికి తీసుకెళ్లిన సంగతి హీరోకి తెలుస్తుంది. తాను సాధారణ మానవుడే అయినా, తన ప్రియురాలిని వెతుక్కుంటూ ఆయన ఆ లోకాలకి వెళ్లడమే ఈ కథ. అందుకోసం ఆయన చేసిన ప్రయత్నాలే ఆసక్తికరం అంటున్నారు. 

ఇలా తన ప్రియురాలిని వెతుకుతూ వెళుతున్న క్రమంలోనే, ఆయా లోకాల్లోని అందాల భామలు హీరోపై మనసు పారేసుకుని .. పాటలు పాడేసుకుంటారని టాక్. ఆ క్రమంలోనే మిగతా ఏడుగురు హీరోయిన్స్ తారసపడతారని అంటున్నారు. ఏ శక్తులను ఎలా గెలిచి హీరోయిన్ ను తిరిగి తీసుకొస్తాడనేది సస్పెన్స్ అంటున్నారు. చూస్తుంటే విజువల్స్ పరంగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేట్టుగానే అనిపిస్తోంది. 

Chiranjeevi
Sri Vashishta
Kalyan Krishna
  • Loading...

More Telugu News