Naga Shaurya: 'రంగబలి' ఇంటర్వ్యూలో నవ్వులు పూయించిన సత్య!

Rangabali Movie Update

  • నాగశౌర్య హీరోగా నిర్మితమైన 'రంగబలి'
  • దర్శకుడిగా పవన్ బాసంశెట్టి పరిచయం 
  • ఈ నెల 7వ తేదీన విడుదలవుతున్న సినిమా 
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న టీమ్

సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా ఇప్పుడు అంతా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. మిగతా వారికి భిన్నంగా తమ సినిమా ప్రమోషన్స్ జరగాలని భావిస్తున్నారు. రిలీజ్ కి ముందు జరిగే ఇంటర్వ్యూల కోసం కొత్త కాన్సెప్టుల కోసం ట్రై చేస్తున్నారు. 'రంగబలి' ఇంటర్వ్యూ విషయంలో ఆ సినిమా టీమ్ ఇలాగే ట్రై చేసింది. 

ఈ నెల 7న రిలీజ్ కానున్నఈ సినిమా కోసం, హీరో నాగశౌర్యను కమెడియన్ సత్య ఇంటర్వ్యూ చేశాడు. 'రంగస్థలం'లోని 'రంగ' .. 'బాహుబలి'లోని 'బలి' తీసుకుని, ఈ సినిమాకి 'రంగబలి' అనే టైటిల్ ను సెట్ చేశారా? అంటూ ఫస్టు పార్టులో ఆయన నవ్వులు పూయించాడు. ఇక సెకండ్ పార్టులో రిపోర్టర్ 'గ్రాఫర్'గా సత్య చూపించిన బాడీ లాంగ్వేజ్ .. ప్రశ్నలు అడిగే స్టైల్ నవ్విస్తాయి. 

ఇక 'వల్లి' పేరుతో లేడీ లుక్ తో కూడా సత్య సందడి చేశాడు. సినిమాల్లోనే కాదు బయట కూడా నాగశౌర్య బోల్డ్ గా ఉంటాడని తెలిసింది అంటూ సత్య సూటిగా అడిగాడు. పాత్ర కోసం సినిమాలో అలా కనిపిస్తాను .. బయట అలా ఉంటానని మీకు ఎవరు చెప్పారు? అంటూ నాగశౌర్య అసహనాన్ని ప్రదర్శించాడు. దాంతో తన స్టూడియోలో నుంచి వెళ్లిపొమ్మంటూ సత్య సీరియస్ అవుతాడు. మొత్తానికైతే ఈ ఇంటర్వ్యూ కొత్తగా అనిపించింది.

Naga Shaurya
Yukti Thareja
Pavan Basam Shetty
Rangabali
  • Loading...

More Telugu News