Bandi Sanjay: ఫార్చ్యూనర్ కారును, చాంబర్ ను అప్పగించిన బండి సంజయ్

Bandi Sanjay returns car and office

  • ఏడాది క్రితం పార్టీ తనకు కేటాయించిన కారును పంపించిన సంజయ్
  • ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కోసం రూ.2 కోట్లు ఖర్చు చేసిన పార్టీ 
  • కార్యాలయ ఛాంబర్ నూ హ్యాండోవర్ చేసిన కరీంనగర్ ఎంపీ

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన బండి సంజయ్... పార్టీ తనకు కేటాయించిన ఫార్చ్యూనర్ కారును రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి పంపించారు. అంతేకాకుండా తన ఛాంబర్ ను కూడా హ్యాండోవర్ చేశారు. గత ఏడాది 2022లో టయోటా ఫార్చునర్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.

ఈ వాహనం కోసం పార్టీ తరఫున రూ.2 కోట్లు కేటాయించింది. ఈరోజు అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో సంజయ్ దానిని తిరిగి ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ అధిష్ఠానం బండి సంజయ్ ని తప్పించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది.

Bandi Sanjay
BJP
  • Loading...

More Telugu News