mangalavaaram: పాయల్ రాజ్‌పుత్ కొత్త సినిమా టీజర్.. భయపెడుతున్న ‘మంగళవారం’!

payal rajputs mangalavaaram teaser released

  • పాయల్, అజయ్ భూపతి కాంబోలో ‘మంగళవారం’
  • ‘కళ్లలో భయం’ పేరుతో టీజర్ రిలీజ్
  • అదిరిపోయిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్

‘ఆర్ఎక్స్ 100’ తర్వాత పాయల్ రాజ్‌పుత్, దర్శకుడు అజయ్ భూపతి కలిసి చేస్తున్న సినిమా ‘మంగళవారం’. ఈ రోజు టీజర్‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్. పెద్దగా డైలాగ్స్ లేకుండానే.. అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తోనే సాగిన టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

టీజర్ లో చాలా క్యారెక్టర్స్ ని చూపించారు. వాళ్లందరూ ఆకాశంలో ఏదో వింతను చూస్తున్నట్లు ఉన్న సీన్స్ మాత్రమే చూపించారు. ‘కళ్లలో భయం’ పేరుతో రిలీజ్ చేసిన వీడియో అందుకు తగ్గట్లే ఉంది. చివర్లో పాయల్ అరుస్తున్న సన్నివేశం, నగ్నంగా ఉన్న సీన్స్ అయితే ‘మంగళవారం’పై ఆసక్తిని పెంచుతున్నాయి.

ముఖ్యంగా ‘కాంతార’ ఫేమ్ అజనీశ్ లోక్‌నాథ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్. గ్రామీణ నేపథ్య కథతో తీస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది.

More Telugu News