Wamiqa Gabbi: సోనీలివ్ లో మిస్టరీ థ్రిల్లర్ గా 'ఛార్లీ చోప్రా' .. ఫస్టు ఎపిసోడ్ లోనే ట్విస్ట్!

Charlie Chopra  Web Series

  • మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో సాగే 'ఛార్లీ చోప్రా'
  • ఫస్టు ఎపిసోడ్ తోనే ఆసక్తిని పెంచిన వెబ్ సిరీస్
  • ప్రధానమైన పాత్రలో కనిపిస్తున్న వామికా గబ్బి 
  • కీలకమైన పాత్రలలో సీనియర్ ఆర్టిస్టులు   

సోనీ లివ్ లో కొన్ని రోజులుగా 'ఛార్లీ చోప్రా' స్ట్రీమింగ్ అవుతోంది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్, హిందీతో పాటు తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. మరాఠి .. బెంగాలీ భాషల్లో అందుబాటులో ఉంది. ముందుగా ఫస్టు ఎపిసోడ్ ను వదిలారు. ఫస్టు ఎపిసోడ్ తోనే ఉత్కంఠను రేకెత్తించే ప్రయత్నం చేశారు. 'మనాలి' ప్రాంతంలో మంచుతుపాను కొనసాగుతూ ఉంటుంది. ఆ తుపాను రాత్రిలో కల్నల్ ఇంట్లో క్షుద్రపూజలు జరుగుతూ ఉంటాయి. 

ఆ ఇంట్లోని వసీమాను దెయ్యం ఆవహిస్తుంది. 'రోజ్' అనే ఆమె ప్రేతాత్మ అక్కడ తిరుగుతోందనీ, ఆ ప్రేతాత్మ వలన బ్రిగేడియర్ ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆ మాంత్రికుడు చెబుతాడు. దాంతో కల్నల్ కుటుంబ సభ్యులు కంగారుపడతారు. బ్రిగేడియర్ ను ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో, ఆ మంచు తుపానులోనే నడుస్తూ, ఆయన ఇంటికి కల్నల్ చేరుకుంటాడు. అయితే అప్పటికే ఆయన చనిపోయి ఉంటాడు. ఆ సమాచారం అందుకోగానే పోలీసులు రంగంలోకి దిగుతారు. 

ఈ హత్య కేసులో పోలీసులు 'జిమ్మీ' అనే యువకుడిని అరెస్టు చేస్తారు. అతని కాబోయే భార్య ఛార్లీకి ఈ విషయం తెలియగానే 'మనాలి' చేరుకుంటుంది. తాను ఈ హత్య చేయలేదని జిమ్మీ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇంతకీ రోజ్ ఎవరు? ఎందుకు ఆమె ప్రేతాత్మగా మారింది? బ్రిగేడియర్ ను హత్య చేసింది ఎవరు? జిమ్మీ విషయంలో ఛార్లీ ఏం చేస్తుంది? అనేది మిగతా కథ. నసీరుద్దీన్ షా .. నీనా గుప్తా .. గుల్షన్ గ్రోవర్ .. వామిక గబ్బీ .. లారా దత్త ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ వెబ్ సిరీస్, మరింత ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ తో పలకరించనుంది.

Wamiqa Gabbi
Naseeruddin Shah
Neena Guptha
Gulshan Geover
  • Loading...

More Telugu News