Shahrukh Khan: షూటింగ్ లో షారుఖ్ ఖాన్ కు ప్రమాదం.. ముక్కుకు సర్జరీ

Shahrukh Khan met with accident

  • లాస్ ఏంజెలెస్ లో షూటింగ్ సందర్భంగా ప్రమాదం
  • షారుఖ్ ముక్కుకు బలమైన గాయం
  • ముంబైలోని నివాసానికి చేరుకున్న షారుఖ్ 

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన గాయపడ్డారు. ఆయన ముక్కుకు బలమైన దెబ్బ తగిలింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ముక్కు నుంచి బ్లీడింగ్ ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో ముక్కుకు సర్జరీని నిర్వహించినట్టు సమాచారం. ఇప్పుడు షారుఖ్ ఆరోగ్యం బాగుందని వైద్యులు తెలిపారు. సర్జరీ తర్వాత షారుఖ్ ముక్కుకు బ్యాండేజ్ తో కనిపించారు. ప్రమాదం నేపథ్యంలో ఆయన ముంబైలోని తన నివాసం మన్నత్ కు చేరుకున్నారు.

Shahrukh Khan
Injury
Bollywood
  • Loading...

More Telugu News