Viral Videos: యువకుడి చెంప ఛెళ్లుమనిపించిన యువతి.. మెట్రోలో షాకింగ్ సన్నివేశం

Woman Scolds Slaps Man in Delhi Metro video goes viral

  • ఢిల్లీ మెట్రోలో మరో షాకింగ్ సన్నివేశం
  • యువతీయువకుల మధ్య వాగ్వాదం, చెంప ఛెళ్లుమనిపించిన యువతి
  • మౌన ప్రేక్షకులుగా మారిపోయిన ఇతర ప్రయాణికులు
  • నెట్టింట వీడియో వైరల్

ప్రయాణికుల మధ్య వివాదాలకు కేరాఫ్‌గా ఢిల్లీ మెట్రో మారిపోయింది. దాదాపు రోజు మెట్రో ప్రయాణికులు తగవు పడుతున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా మెట్రోలో ఓ యువతి యువకుడిపై చేయి చేసుకుంటున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. యువకుడితో వాగ్వాదానికి దిగిన యువతి అకస్మాత్తుగా అతడి చెంప ఛెళ్లుమనిపించింది. ఇంత జరుగుతున్నా ఇతర ప్రయాణికులు మాత్రం వారి వివాదంలో జోక్యం చేసుకోలేదు. మౌనంగా జరుగుతున్నది చూస్తుండిపోయారు. కొందరు వారిద్దరివైపు కనీసం ముఖాలు తిప్పి కూడా చూడలేదు. 

అసలు వీరిద్దరి మధ్య వివాదం ఎందుకు మొదలైందన్నది తెలియరాలేదు. అయితే, వారిద్దరూ పరిచయస్తులేనన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ అక్కడున్న వారెవరూ స్పందించకపోవడంపై కొందరు నెటిజన్లు విచారం వ్యక్తం చేశారు. ‘‘అదే యువకుడు గనుక మహిళపై చేయి ఎత్తి ఉంటే సీన్ మరోలా ఉండేది. అక్కడ ఉన్నది మహిళ కాబట్టి ఎవరి మానాన వారు మిన్నకుండిపోయారు’’ అని మరికొందరు అభిప్రాయపడ్డారు. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి!

Viral Videos
New Delhi
Delhi Metro

More Telugu News