Prabhas: ప్రభాస్ కి పరీక్షా సమయమే .. 'సలార్' సాలీడ్ హిట్ కొట్టవలసిందే!

Salaar Movie Update

  • పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్
  • ఆయన మార్కెట్ కి దూరంగా నిలిచిన మూడు సినిమాలు
  • 'సలార్' సంచలనం ఖాయమేనంటున్న ఫ్యాన్స్ 
  • కంటెంట్ పరంగా కనిపిస్తున్న లక్షణాలు 
  • సెప్టెంబర్ 28వ తేదీన విడుదల

'బాహుబలి' సినిమాతో ప్రభాస్ క్రేజ్ .. మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. అప్పటి నుంచి ఆయన వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. 'సాహో' స్టైలీష్ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధిస్తుందని అందరూ భావించారు. కానీ ప్రభాస్ క్రేజ్ కి తగిన స్థాయిలో ఇది లాగలేకపోయింది. 

ఇక ఆ తరువాత ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమా చేశాడు. ప్రభాస్ కి లవ్ స్టోరీ వర్కౌట్ అవుతుందా .. పైగా క్లాసికల్ టచ్ లా కనిపించే ఎమోషన్స్ ఆయనకి నప్పుతాయా? హస్తసాముద్రకుడిగా ఆయన పాత్రలో ఆశించిన ఎనర్జీ ఉంటుందా? అని అభిమానులు డౌట్ పడ్డారు. అన్నట్టుగానే ఆ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. ఇక ఇటీవల వచ్చిన 'ఆదిపురుష్' .. వీకెండ్ తరువాత ఒక్కసారిగా వసూళ్ల గ్రాఫ్ పడిపోవడం చూసింది. ఓం రౌత్ లా కష్టపడి పనిచేసే డైరెక్టర్ ను తాను చూడలేదని ఈవెంటులో ప్రభాస్ చెప్పిన మాటలు విమర్శలను తెచ్చిపెట్టాయి. 

ఈ నేపథ్యంలో ప్రభాస్ నుంచి రానున్న సినిమా 'సలార్'. ప్రభాస్ క్రేజ్ .. ఆయన మార్కెట్ సంగతి అలా ఉంచితే, ఆయన బ్లాక్ బస్టర్ ఇచ్చి చాలా కాలమైంది. అందువలన 'సలార్' పెద్ద హిట్ కొట్టవలసిన అవసరం ఉంది. ఆ తరువాత వచ్చే 'ప్రాజెక్టు K' బిజినెస్ కూడా ఈ సినిమా ఫలితంపై ఆధారపడి ఉంటుంది. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ కావడం .. ప్రభాస్ మాస్ ఇమేజ్ కి తగిన కంటెంట్ కావడం వలన, 'సలార్' సంచలనాన్ని నమోదు చేయడం ఖాయమే అనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన విడుదల కానుంది. 

Prabhas
Sruthi Haasan
Jagapathi Babu
Salaar Movie
  • Loading...

More Telugu News