Sri Vishnu: 'సామజవరగమన' 4 రోజుల వసూళ్లు ఇవే!

Samajavaragamana Movie Update

  • ఈ నెల 29న విడుదలైన 'సామజవరగమన'
  • 4 రోజుల్లో 19.8 కోట్ల గ్రాస్ వసూళ్లు 
  • మరింతగా వసూళ్లు పుంజుకునే అవకాశం
  • కామెడీనే ప్రధానమైన బలంగా కనిపించే కంటెంట్

మొదటి నుంచి కూడా శ్రీవిష్ణుకి కామెడీపై మంచి పట్టు ఉంది. కథ ఏదైనా అది కామెడీ టచ్ తో సాగేలా చూసుకుంటూ వస్తున్నాడు. 'బ్రోచేవారెవరురా' .. ' రాజరాజ చోర' సినిమాలు కామెడీ ఎపిసోడ్స్ లో ఆయన సత్తాను నిరూపించాయి. ఆ తరువాత ఆ స్థాయి కంటెంట్ ఉన్న సినిమాలు పడలేదని అనుకుంటూ ఉన్న సమయంలోనే ఆయన 'సామజవరగమన' చేశాడు.

ఈ నెల 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటూ ముందుకు వెళుతోంది.  ప్రపంచవ్యాప్తంగా ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమా 19.8 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. పెద్దగా అంచనాలు వచ్చిన ఈ సినిమా, ఇక నుంచి వసూళ్ల పరంగా మరింత పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో వచ్చిన సినిమాలలో ఇది ముందువరుసలో నిలుస్తుంది. కథ .. కథనంతో పాటు సంభాషణలు కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. సన్నివేశాలు అతికించినట్టుగా కాకుండా అల్లుకుపోయినట్టుగా ఉండటం . వాటికీ మంచి డైలాగ్స్ తోడు కావడం ఈ సినిమా విజయానికి ప్రధానమైన కారణమనే టాక్ వినిపిస్తోంది. 

More Telugu News