Bholaa Shankar: గుమ్మడికాయ కొట్టేసిన భోళా శంకర్!

Bholaa Shankar wraps up  Shooting

  • చిరంజీవి హీరోగా మెహెర్ రమేశ్ దర్శకత్వంలో సినిమా
  • షూటింగ్ పూర్తయినట్లు ప్రకటించిన దర్శకుడు
  • ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

తన సెకండ్ ఇన్నింగ్స్‌లో 'వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయన ఇప్పుడు ‘భోళా శంకర్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మెగాస్టార్ వింటేజ్‌ లుక్‌ లో కనిపిస్తున్న ఈ చిత్రంపైనా అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్  పూర్తయిందని దర్శకుడు తెలిపారు. మెగాస్టార్ తో కలిసి ఉన్న ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. 

పగలు, రాత్రి అన్న తేడా లేకుండా సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డ యూనిట్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నటీనటులు కూడా బాగా సహకరించారని చెప్పారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్  స్పీడ్ లో కొనసాగుతున్నాయని తెలిపారు. ఇక ప్రమోషన్ కార్యక్రమాలు, సాంగ్స్ రిలీజ్ లకు సంబంధించిన పనే మిగిలి ఉందని తెలిపారు. ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీవుతోంది. చిరు సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది. కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలు పాత్ర పోషించింది. అక్కినేని సుశాంత్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Bholaa Shankar
Chiranjeevi
meher ramesh
Keerthy Suresh
Tamannaah

More Telugu News