Sri Vishnu: 'సామజవరగమన' మూవీ మండే టాక్!

Samajavaragamana Monday Tlak

  • ఈ నెల 29న వచ్చిన 'సామజవరగమన' 
  • తొలిరోజునే దక్కిన హిట్ టాక్
  • వీకెండ్ తరువాత తగ్గని వసూళ్లు 
  • ఆడియన్స్ కి నచ్చిన ఫ్యామిలీ ఎంటర్టయినర్

శ్రీవిష్ణు హీరోగా రూపొందిన 'సామజవరగమన' జూన్ 29వ తేదీన థియేటర్లకు వచ్చింది. రాజేశ్ దండా నిర్మించిన ఈ సినిమాకి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో కథానాయికగా రెబా మోనిక జాన్ పరిచయమైంది. పెద్దగా హడావిడి .. అంచనాలు లేకుండా థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా, తొలిరోజునే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టయినర్ అనే టాక్ థియేటర్స్ దగ్గర వినిపించింది. 
 
ప్రేమకి దూరంగా ఉండే ఒక మధ్య తరగతి యువకుడు ఎలా ప్రేమలో పడ్డాడు? తన పెళ్లికి ఉన్న అడ్డంకులను తొలగించడానికి ఏం చేశాడు? చివరికి ఏమైంది? అనేదే కథ. చెప్పుకోవడానికి కథగా ఏమీ ఉండదు .. కానీ తెరపై నుంచి కావలసినంత వినోదాన్ని తోడుకోవచ్చు. గతంలో హీరోయిన్స్ వైపు నుంచి చూపిస్తూ వచ్చిన సన్నివేశాలను రివర్స్ చేసి, హీరో వైపు నుంచి చూపించడం ఈ సినిమా ప్రత్యేకత. ఫస్టాఫ్ మొత్తం ప్రేమ గురించి నడిస్తే, సెకండాఫ్ మొత్తం పెళ్లి గురించి సాగడం మరో విశేషం. 

ఇక ఈ సినిమాలో కామెడీకి సంబంధించి ఫస్టాఫ్ అంతా నరేశ్ తో ముడిపడి సాగుతుంది. సెకండాఫ్ అంతా వెన్నెల కిశోర్ భుజాలపై కామెడీ కనిపిస్తుంది. తన ప్రేమను పెళ్లిపీటల వైపుకు తీసుకుని వెళ్లాలనే టెన్షన్ లో హీరో .. కావలసినంత కామెడీని పండిస్తాయి. రియల్ లొకేషన్స్ ఈ సినిమాకి మరింత సహజత్వాన్ని తీసుకొచ్చాయి. కామెడీ టచ్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా మౌత్ టూ మౌత్ పబ్లిసిటీతో ఈ సినిమా వీకెండ్ తరువాత కూడా నిలబడటం విశేషం.

Sri Vishnu
Reba Monika John
Naresh
Vennela Kishore
  • Loading...

More Telugu News