Nidhi Agerwal: అందాల నిధికి అనుకోకుండా వచ్చేసిన గ్యాప్!

Nidhi Agerwal Special

  • గ్లామరస్ హీరోయిన్ గా నిధికి పేరు 
  • అవకాశాలను అందుకోవడంలో నిదానం 
  • ఆడియన్స్ తో పెరుగుతున్న గ్యాప్ 
  • నిర్మాణ దశలోనే ఉండిపోయిన 'వీరమల్లు'    

తెలుగు తెరపై గ్లామర్ క్వీన్ అనిపించుకున్న కథానాయికలు కొంతమందే. అలాంటివారి జాబితాలో నిధి అగర్వాల్ కూడా ఒకరుగా కనిపిస్తుంది. చందమామ కంటే అందంగా ఉందని చెప్పేసి ఫస్టు సినిమాతోనే కుర్రాళ్ల నుంచి ఫస్టు మార్కులు కొట్టేసింది. టాలీవుడ్ ను ఈ బ్యూటీ ఏలేస్తుందని చాలా మంది జోస్యం కూడా చెప్పారు. కానీ ఈ సుందరి గడిచిన ఆరేళ్లలో తెలుగులో చేసినవి నాలుగు సినిమాలే. 

మొదటి రెండు సినిమాలు కథాకథనాల పరంగా ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోయినా, గ్లామర్ పరంగా నిధి అందరి మనసులను దోచుకుంది. మూడో సినిమాగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' బ్లాక్ బస్టర్' హిట్ కొట్టినా అమ్మడు తన స్పీడ్ మాత్రం పెంచలేదు. రన్నింగ్ లో ఉన్న స్టార్ హీరోలందరినీ పక్కన పెట్టేసి, కొత్త హీరో జోడీ కట్టడం గురించి కూడా అప్పట్లో కామెంట్లు ఫేస్ చేయవలసి వచ్చింది. 

పోనీలే 'హరి హర వీరమల్లు' సినిమాతోనైనా దార్లో పడుతుందని అనుకుంటే, ఆ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. ఇక ప్రభాస్ - మారుతి ప్రాజెక్టులో ఆమె పేరు అయితే వినిపించింది. కానీ అందుకు సంబంధించిన అప్ డేట్ మాత్రం బయటికి రాలేదు. చూస్తుండగానే నిధికి గ్యాప్ వచ్చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉండే నిధి, అందానికి క్రేజ్ కూడా అవసరమే అనే విషయమే గుర్తించవలసి ఉంది. 

Nidhi Agerwal
Actress
Veeramallu
Tollywood
  • Loading...

More Telugu News