Sri Simha: ఈ సారి హిట్ కొట్టాల్సిందే అంటున్న శ్రీసింహా!

Bhag Sale movie update

  • సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న శ్రీసింహా 
  • ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'భాగ్ సాలే'
  • దర్శకుడిగా ప్రణీత్ పరిచయం 
  • ఈ నెల 7వ తేదీన సినిమా విడుదల

కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవ సంగీత దర్శకుడిగా నిలదొక్కుకున్నాడు. తండ్రి మాదిరిగానే తాను మంచి గాయకుడు కూడా. ఆ దిశగా కూడా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. కీరవాణి చిన్నబ్బాయ్ శ్రీసింహా కూడా ఇంచుమించు కాలభైరవతోనే హీరోగా తన కెరియర్ ను మొదలుపెట్టాడు. 

అప్పటి నుంచి శ్రీసింహా తనకి నచ్చిన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. 'మత్తువదలరా' .. 'తెల్లవారితే గురువారం' .. 'దొంగలున్నారు జాగ్రత్త' వంటి సినిమాలు చేస్తూ వచ్చాడు. ఆ సినిమాలు హిట్ కాకపోయినా, కొత్త ప్రయోగం .. కొత్త ప్రయత్నం అని మాత్రం అనిపించుకున్నాయి. ఇక ఇప్పుడు ఆయన తాజా చిత్రంగా 'భాగ్ సాలే' సినిమా రూపొందింది. 

బిగ్ బెన్ సినిమాస్ వారు నిర్మించిన ఈ సినిమాకి ప్రణీత్ దర్శకత్వం వహించాడు. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 7వ తేదీన థియేటర్లకు ఈ సినిమా రానుంది. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతామనే పట్టుదలతో శ్రీసింహా ఉన్నాడు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులోను ఆయన మాటల్లో ఈ నమ్మకమే కనిపించింది. చూడాలి మరి ఈ సినిమా ఆయనకి సక్సెస్ ను ఇస్తుందేమో. 

Sri Simha
Kalabhairava
Bhag Sale Movie
  • Loading...

More Telugu News