Ramcharan: హేమాహేమీలతో రామ్ చరణ్... కొత్త యాడ్ కోసమా?

Ram Charan latest projest with other stars

  • శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రంతో బిజీగా ఉన్న రామ్ చరణ్
  • ఇటీవలే రామ్ చరణ్ కు పుత్రికోత్సాహం
  • మరోవైపు యాడ్ ఫిలింతో గ్లోబల్ స్టార్ కోలాహలం 

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ తో బిజీగా ఉన్నారు. ఇటీవలే పుత్రికోత్సాహంతో హుషారుగా ఉన్న రామ్ చరణ్ ఓ యాడ్ లోనూ కనువిందు చేయనున్నారు. మీషో సంస్థ కోసం ఇతర అగ్రతారలతో కలిసి పనిచేసినట్టు తెలుస్తోంది. రణవీర్ సింగ్, దీపిక పదుకొణె, త్రిష వంటి స్టార్లు కూడా ఈ యాడ్ ఫిలింలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో 'షో మీ ద సీక్రెట్' పేరుతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. దీంట్లో భారీ స్టార్లు ఉండడంతో సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.   

తన భర్త కనిపించడంలేదని దీపిక పదుకొణె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రోమో మొదలవుతుంది. ఆ తర్వాత రామ్ చరణ్ ఓ చేజింగ్ సీన్లో కనిపిస్తాడు. మరోవైపు రణవీర్ సింగ్ యాంగ్రీ లుక్ తో కనిపించగా, త్రిష కూడా దర్శనమిస్తుంది. మొత్తమ్మీద ఆ ప్రోమో ఓ భారీ యాక్షన్ చిత్రం స్థాయిలో ఉంది.

More Telugu News