Chaitanya: పెళ్లయిన రెండు నెలలకే మెడికో ఆత్మహత్య... నెల్లూరులో ఘటన

Medico commits suicide in Nellore

  • నారాయణ మెడికల్ కాలేజీలో వైద్యవిద్య అభ్యసిస్తున్న చైతన్య అనే యువతి
  • చైతన్య స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పలాస
  • హాస్టల్ గది నుంచి చైతన్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • కుటుంబ కలహాలే ఆమె ఆత్మహత్యకు కారణమని భావిస్తున్న వైనం

ఇటీవల కాలంలో విద్యాసంస్థల్లో ఆత్మహత్యల ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా, నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న చైతన్య అనే మెడికో బలవన్మరణానికి పాల్పడింది. చైతన్య స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని పలాస. ఆమెకు రెండు నెలల క్రితమే పెళ్లయింది. అంతలోనే ఆత్మహత్యకు పాల్పడాల్సినంత సమస్య ఏమై ఉంటుందని అందరూ చర్చించుకుంటున్నారు. మెడికో ఆత్మహత్య వెనుక ఏదో గట్టి కారణమే ఉంటుందని భావిస్తున్నారు. 

నెల్లూరులోని హాస్టల్ గది నుంచి చైతన్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమె మృతికి కుటుంబ కలహాలు కారణం కావొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

Chaitanya
Medico
Suicide
Narayana Medical College
Hostel
Nellore
Palasa
Srikakulam District
  • Loading...

More Telugu News