Pawan Kalyan: 'బ్రో' నుంచి పవన్ ఫొటో లీక్ చేసిన దర్శకుడు

Samuthirakani shares Pawan Kalyan still from BRO movie

  • బ్రో చిత్రంలో నటిస్తున్న పవన్ కల్యాణ్
  • సముద్రఖని దర్శకత్వంలో చిత్రం
  • క్లబ్ లో పవన్ కల్యాణ్... పిక్ ను పంచుకున్న సముద్రఖని
  • ఈ నెల 28న వస్తున్న బ్రో

ఇటీవల కాలంలో చిత్రబృందమే ఆసక్తికర లీకులు చేయడం ఓ ట్రెండ్ గా మారింది. తాజాగా, బ్రో చిత్రం నుంచి పవన్ కల్యాణ్ పిక్ ను దర్శకుడు సముద్రఖని లీక్ చేశాడు. ఓ క్లబ్ లో పవన్ కల్యాణ్ ను చూసి అమ్మాయిలు హుషారుగా కేరింతలు కొడుతున్న దృశ్యాలను ఈ ఫొటోలో చూడొచ్చు. బ్రో చిత్రంలో మన బ్రో అంటూ సముద్రఖని ఈ ఫొటోకు క్యాప్షన్ పెట్టాడు. కాసేపట్లోనే ఈ ఫొటోకు వేల సంఖ్యలో లైకులు, రీట్వీట్లు, వ్యూస్ వచ్చాయి. 

పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటిస్తున్న చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న బ్రో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇందులో కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికలు. ఈ చిత్రం జులై 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Pawan Kalyan
BRO
Samuthirakani
Sai Dharam Tej
Tollywood
  • Loading...

More Telugu News