corporate tax: అంబానీ కంపెనీ కట్టిన పన్ను ఎంతంటే..

last year corporate tax income details

  • గతేడాది కంపెనీల నుంచి ప్రభుత్వానికి 3.64 లక్షల కోట్ల ఆదాయం
  • కార్పొరేట్ టాక్స్ ద్వారానే కేంద్రానికి ఎక్కువ ఆదాయం
  • పన్ను చెల్లింపుల్లో నెంబర్ వన్ గా టాటా గ్రూప్
  • రూ.20 వేల కోట్లు చెల్లించిన హెచ్ డీఎఫ్ సీ

ఉద్యోగస్తులు, వ్యాపారస్తుల వార్షిక ఆదాయం నిర్ణీత పరిమితి దాటితే ఏటా ఆదాయ పన్ను చెల్లించాలి. అదేవిధంగా కంపెనీలు కూడా ఏటేటా ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనిని కార్పొరేట్ టాక్స్ అంటారు. మన దేశంలో ఇలా వివిధ కంపెనీల నుంచి ఏటా పెద్దమొత్తంలో కేంద్రానికి ఆదాయం సమకూరుతుంటుంది. పన్నుల చెల్లింపు విషయంలో టాటా గ్రూప్ టాప్ లో ఉంది.

గతేడాది ఈ కంపెనీ చెల్లించిన కార్పొరేట్ ట్యాక్స్ రూ.30 వేల కోట్లు.. కాగా, రిలయన్స్ గ్రూప్ చెల్లించిన కార్పొరేట్ ట్యాక్స్ రూ.20,730 కోట్లు. తర్వాతి స్థానంలో హెచ్ డీ ఎఫ్ సీ గ్రూప్ రూ.20,300 కోట్ల టాక్స్ కట్టి రెండో స్థానంలో నిలిచింది. ఈ లిస్ట్ లో ఐదో స్థానంలో నిలిచిన ఐసీఐసీఐ బ్యాంకు ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్స్ రూ.12,800 కోట్లు. బజాజ్ గ్రూప్ కంపెనీలు చెల్లించిన ట్యాక్స్ రూ.10,554 కోట్లు కాగా, అనిల్ అగర్వాల్ కు చెందిన వేదాంత గ్రూప్ రూ.10,547 కోట్ల పన్ను చెల్లించింది.

ఇలా దేశంలోని వివిధ కంపెనీల నుంచి గతేడాది కేంద్ర ప్రభుత్వానికి రూ.3.64 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. అంతకుముందు ఏడాది ఈ మొత్తం రూ.3.41 లక్షల కోట్లు.. మిగతా ఆదాయ వనరులతో పోలిస్తే కేంద్రానికి కార్పొరేట్ ట్యాక్స్ తోనే ఎక్కువ ఆదాయం సమకూరుతోందని నిపుణులు చెబుతున్నారు.

corporate tax
private companies
tax
Reliance
tata group
business
  • Loading...

More Telugu News